Pages

20110901

తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా - lyrics


తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా
చిగురుమావి కుబురులోని కుహుకుహూల రాగమా
I'm feeling feeling feeling
that I'm fallen in love
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
I want to live
ఈ ఊరి గాలి మంచి కబురు తెచ్చింది
కోరుకోని కాలమేమో కలిసొచ్చింది
నయగారా దారుల్లో ఉరికే జలపాతమా
న్యూజెర్సీ తోటల్లో అల్లుకున్న శాంతమా
I'm feeling feeling feeling
that I'm fallen in love
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
I want to live
ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది
ఇంత వరకు లేని హాయి తెలిసొచ్చింది


జూలియెట్టు రోమియోల జంటలేల మనది
నల దమయంతిలోని పంతమే ఇది
డ్రీం ల్యాండు నేల మీద ప్రేమ కాండ మనది
యదుకుల వీధిలోని ప్రణయమే ఇది
దేశం మారినా 
ప్రేమ రసం ఒక్కటే
కాలం మారినా 
కన్నెతనం ఒక్కటే
చనువే పెరిగినా తనువే మరిగినా
సరిగంగ స్నానాల వణుకు ఒక్కటే


వాల్ట్ డిస్నీ ఊహల్లో దాగిన సౌందర్యమా
పడమరమ్మ నుదుటి పైన మెరిసే సిందూరమా
I'm feeling feeling feeling
that I'm fallen in love
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
I want to live


ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం
మధువుల ముంచు ఫ్రెంచు ముద్దులే సుమా
సీమరాణి రామరాజు దగ్గరైన సమయం
మనువుకు ప్రేమ తాడు సిద్ధమే సుమా
అథిదిగా వచ్చినా. 
అమృతమే ఇవ్వనా
హృదయం అర్పన ఈ క్షణమే చెయ్యనా
కరగని కాంక్షతో వదలని దీక్షతో
వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెన


విజయనగర వీధుల్లో మెరిసే రవి కిరణమా
వాషింగ్టన్ DC లో కురిసే హిమ ఛైత్రమా
I'm feeling feeling feeling
that I'm fallen in love
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
I want to live
ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది
కోరుకోని కాలమేమో కలిసొచ్చింది

2 comments:

kiran said...

nenu 1st time vinnaa..bagundi..:)
Ori kosam..?? :P

వంశీ కిషోర్ said...

bullemma kosam :)